హోటళ్లు, కేఫ్‌లలో పని చేసే వారి నెల జీతం ఎంత ఉంటుంది..? పెద్ద కేఫ్‌లు అయితే రూ. 50 వేల నుంచి రూ.70 వేల వరకు ఇవ్వొచ్చు. కానీ కేఫ్ నీలోఫర్‌లో పనిచేసే సిబ్బంది జీతం తెలిస్తే నోరెళ్లబెడతారు. కేఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అనుమల శశాంక్ ఓ బిజినెస్ పాడ్‌కాస్ట్‌లో తమ సిబ్బంది జీతాలపై కీలక విషయాలు వెల్లడించారు. కార్పొరేట్ కంపెనీల సీఈవోల స్థాయిలో తమ వద్ద పనిచేసే కొందరికి సంవత్సరానికి రూ. 60 లక్షలు జీతం ఇస్తున్నట్లు తెలిపారు. దిమ్మతిరిగే జీతాలు చూసి ఐటీ ఉద్యోగులతో పాటు నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు.