తానే తెలంగాణ కాక్రోచ్ జనతా పార్టీ సీఎం అభ్యర్థిని అంటూ ఓ యువకుడు రిలీజ్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఇందులో తన మేనిఫేస్టోను వెల్లడించిన ఆ యువకుడు.. హైదరాబాద్‌లో చెట్ల నరికివేతను ఆపడం.. నిందితులకు వీఐపీ ట్రీట్‌మెంట్ రద్దు చేయడం.. విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్లు.. నిరుద్యోగులకు కనీస వేతనాలతో ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇచ్చాడు. రైతులకు కనీస మద్దతు ధర.. ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తామని తేల్చి చెప్పాడు.