కవిత పార్టీ మొదటి అడుగు.. ఎమ్మెల్సీ బరిలో తెలంగాణ రక్షణ సేన.. తొలి అభ్యర్థి పేరు ప్రకటన

2 weeks ago 15
తెలంగాణ రక్షణ సేన పార్టీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి తొలి అడుగు వేసింది. ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తెలంగాణ రక్షణ సేన పార్టీ నుంచి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను నిలబెడుతున్నట్టు చెప్పారు. అభ్యర్థిని ప్రకటించడంతో పట్టభద్రుల ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేసేందుకు తెలంగాణ రక్షణ సేన సన్నాహాలు మొదలుపెట్టింది. తాజాగా తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా కమిటీని కూడా అధ్యక్షురాలు కవిత ప్రకటించారు.
Read Entire Article