ఒమన్‌లో హైదరాబాద్ మహిళకు నరకయాతన.. రూ.50 వేల జీతం పేరుతో మోసం

1 day ago 2
ఉద్యోగం పేరుతో ఒమన్ వెళ్లి అక్కడ యజమాని వేధింపులకు గురైనట్లు హైదరాబాద్‌కు చెందిన షబ్నమ్ బేగం ఆరోపించింది. రోజుకు 12-15 గంటలు పని చేయించి 3 నెలలుగా జీతం ఇవ్వలేదని.. సరైన ఆహారం, వసతి కూడా కల్పించలేదని వీడియోలో వెల్లడించింది. వేధింపుల నుంచి తప్పించుకుని భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించిన ఆమెను స్వదేశానికి తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది. ఈ ఘటనపై మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం స్పందించి అవసరమైన సహాయం అందిస్తామని ప్రకటించింది.
Read Entire Article