Andhra Pradesh Muslim Women Free Sewing Machines: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 18 కేంద్రాల్లో వచ్చే నెల నుంచి ముస్లిం మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. నెల్లూరు జిల్లాలో ఈ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో మరో 18చోట్ల అమలు చేయనున్నారు. ముందుగా ఉచితంగా శిక్షణ ఇస్తారు.. ఆ తర్వాత ముస్లిం మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేయనున్నారు.