ఏపీలో కొత్త జిల్లా.? తీరనున్న దశాబ్దాల కల.. చంద్రబాబు కీలక ఆదేశాలు!

1 year ago 40
ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త జిల్లా ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తామని 2024 ఏపీ ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇక ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించినట్లు తెలిసింది. జిల్లాల పునర్విభజనపై ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై నివేదిక తయారు చేసి ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం.
Read Entire Article