ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ దర్యాప్తు చేసి, కొన్ని ఆధారాలు సేకరించినట్టు ప్రకటించింది. తాజాగా, ఈ కేసుకు సంబంధించి ఈడీ గురువారం ప్రకటన చేసింది. పీఎంఎల్ఏ చట్టం కింద నవంబరు 4న హైదరాబాద్, సికింద్రాబాద్, గుంటూరులో సోదాలు చేశామని తెలిపింది. అంతేకాదు, ఓ సంస్థకు కోటికిపైగా నగదు బదిలీ జరిగినట్టు గుర్తించామని పేర్కొంది.