Andhra Pradesh Panchayat Elections 2026: ఏపీ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి.. ఎన్ని పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించొచ్చనే సమాచారం కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పంచాయతీరాజ్ కమిషనర్‌కు లేఖ రాశారు. కోర్టు కేసులున్న 331 గ్రామాల్లో పరిస్థితిపై కూడా వివరాలు కోరారు. పంచాయతీలకు సంబంధించిన సమాచారంతో నివేదిక ఇవ్వాలని అడిగారు. అన్ని కుదిరితే వచ్చే రెండు మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందంటున్నారు. పవన్ కళ్యాన్ కూడా ఇటీవల నవంబర్ లోపు ఎన్నికలు జరుగుతాయన్నారు.