ఆర్టీసీ డ్రైవర్‌కు చుక్కలు చూపించిన బైకర్.. రాంగ్ రూట్‌లో వస్తే ఇంతే మరి, వీడియో వైరల్!

2 hours ago 1
హైదరాబాద్‌లో ఒక ఆర్టీసీ డ్రైవర్ నిబంధనలకు విరుద్ధంగా రాంగ్ రూట్‌లో బస్సును నడిపాడు. అయితే, ఎదురుగా వచ్చిన ఒక బైకర్ ఏమాత్రం భయపడకుండా బస్సుకు అడ్డంగా బైక్ నిలిపి డ్రైవర్‌ను నిలదీశాడు. డ్రైవర్ బస్సును పక్క నుంచి పోనిచ్చేందుకు ప్రయత్నించినా.. బైకర్ అడ్డుకుంటూ అలాగే నిలబడటంతో చేసేదేం లేక ఆర్టీసీ డ్రైవర్ బస్సును వెనక్కి తిప్పాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Read Entire Article