‘పట్టుదలతో చేస్తే సమరం.. తప్పకుండ నీదే విజయం.. కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా నీ ధైర్యం’ అన్నారు. అవును పట్టుదలతో ప్రయత్నిస్తే అసాధ్యం సుసాధ్యమవుతుందని నిరూపించారు ఓ మహిళ. రెండు దశాబ్దాల కిందట ఆరో తరగతితోనే తన చదువు ఆగిపోతే.. ఆ తర్వాత పెళ్లి, పిల్లలు ఇలా కుటుంబానికి పరిమితమయ్యారు. కానీ, ఇన్నాళ్లకు మళ్లీ చదువుకోవాలనే ఆశ ఆమెకు కలిగింది. తన కొడుకు పదో తరగతికి రావడంతో అతడితో కలిసి పరీక్షలు రాసి.. విజయం సాధించారు.