ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తాజాగా ఆయన సూసైడ్ నోట్ వెలుగులోకి వచ్చింది. తనపై ఆరోపణలు చేసిన మహిళా ట్రైనీ ఐపీఎస్.. ఆమెనే తన రూంకు వచ్చి ముద్దులు, హగ్‌లతో బలవంతం చేసిందని ఆ లేఖలో పేర్కొన్నాడు. ఆమెతో ఏడాది పాటు సంబంధం ఉన్నట్లు తెలిపాడు. ఆమె తనపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు. తన ఐఫోన్‌లో వీడియోలు, చాట్‌ల రూపంలో అన్ని ఆధారాలు ఉన్నాయని.. ఈ క్రమంలోనే నలుగురి పేర్లు ప్రస్తావిస్తూ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు లేఖలో ఉంది.