Andhra Pradesh High Temperatures And Heat Waves Again: ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి రెండోసారి వేసవి కాలం ప్రారంభమైందా అనేలా ఎండల తీవ్రత కనిపిస్తోంది. ఓవైపు వేడిగాలులు, మరోవైపు ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. గత కొద్ది రోజులగా మొదలైన ఎండతీవ్రత రెండు రోజుల నుంచి భారీగా పెరిగింది. ఏకంగా 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదై మరోసారి వేసవి కాలాన్ని గుర్తు చేస్తోంది. ఎల్‌నినో ప్రభావం రాష్ట్రంపై స్పష్టంగా కనిపిస్తోంది.