అయ్యా మా స్టేషన్లలో కూడా రైళ్లు ఆపండయ్యా.. మార్కాపురం జిల్లా వాసుల వినతి

1 day ago 2
ఇప్పుడిప్పుడే ఏర్పడిన మార్కాపురం జిల్లాలో వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేయాలని.. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపేలా చూడాలంటూ ప్రజలు కోరుతున్నారు. మార్కాపురం జిల్లాలోని ప్రధాన రైల్వే స్టేషన్లు అయిన కంభం, గిద్దలూరులో గరీబ్‌రథ్, గువాహటి, దానాపూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగడం లేదని.. దాంతో దూర ప్రాంతాలకు వెళ్లే వారికి ఇబ్బందిగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. దేశానికి రక్షణగా ఉండే సైనికులు వేల సంఖ్యలో ఇదే ప్రాంతం నుంచి ప్రయాణిస్తుంటారు. కనీసం వారి కోసమైనా ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్టాపింగ్ ఇవ్వాలని కోరుతున్నారు.
Read Entire Article