కోనసీమ అంటే మర్యాదలకు పెట్టింది పేరు.. గ్రాండ్ ఫంక్షన్లకు పెట్టింది పేరు. అది మరోమారు రుజువైంది. అమలాపురంలో జరిగిన ఓ ఓణీల ఫంక్షన్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అత్యంత ఆడంబరంగా జరిగిన ఈ వేడుక కోసం ఏకంగా రూ.6 కోట్లు ఖర్చు చేసినట్లు భోగట్టా. వేడుకకు వచ్చిన అతిథుల కోసం 200 రకాల వెరైటీలను వడ్డించారట. భోజనం ఒక్కో ప్లేట్‌కు రూ.6 వేలు ఖర్చు చేసినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.