యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఆయనపై ఉపా చట్టం కింద కేసు నమోదైంది. జనసేన నేత గరికపాటి శివశంకర్ ఫిర్యాదు ఆధారంగా గన్నవరం పోలీసులు ప్రశ్న రావణ్‌పై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ప్రస్తుతం ప్రశ్న రావణ్ గన్నవరం పోలీసుల అదుపులో ఉన్నారు.