Former TTD Employee Cheated Bangalore Devotees: తిరుమల శ్రీవారి దర్శనం, సేవల టికెట్లు, వసతి గదులు ఇప్పిస్తానంటూ బెంగళూరు భక్తుల్ని టీటీడీ మాజీ ఉద్యోగి అరుణ్‌కుమార్ మోసం చేశాడు. భక్తుల నుంచి భారీగా డబ్బులు తీసుకున్నాడు.. అతడ్ని తిరుమల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరుణ్‌కుమార్ టీటీడీలో కొంతకాలం పనిచేయగా ఆయన్ను తొలగించారు. 2023లో దర్శనాలు, గదుల పేరుతో భక్తుల్ని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయినా సరే మళ్లీ భక్తుల్ని మోసం చేసి మరోసారి అరెస్టయ్యాడు.