TGSRTC వినూత్న ఆలోచన.. అదిరిపోయిన టెక్నాలజీ.. ఇక వాటికి చెక్ పడినట్లే..!

1 year ago 28
తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్ ఐఐటీ సహకారంతో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఒక ప్రత్యేక అలారం వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఈ వ్యవస్థ డ్రైవర్ నిద్రపోయినా, తల పక్కకు తిప్పినా, బస్సు దగ్గరకు ఏదైనా వాహనం వచ్చినా లేదా బస్సు రోడ్డు మీద గీత దాటినా, ప్రమాదకరమైన మలుపులు తిరుగుతున్నా వెంటనే అలారం మోగించి డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది. దీని వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గడమే కాకుండా.. ప్రజా రవాణా వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఏర్పడనుంది. బస్సుల్లో ప్రయాణం చాలా సురక్షితంగా ఉంటుందనే సంకేతాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే చర్యల్లో భాగంగా దీనిని చూడవచ్చు.
Read Entire Article