కాశీబుగ్గ హిట్ అండ్ రన్ కేసు వ్యవహారంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు అనుకూలంగా వ్యవహరించారనే అభియోగాలతో పోలీసులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ బైక్ నడపడంతోనే వ్యక్తి మరణించాడని పోలీసులు చెబుతున్నారు. అదే సమయంలో ఈ కేసు నుంచి ఆరవ్‌ను తప్పించే ప్రయత్నాలు కూడా చేశారని.. దానికి సీఐ, ఎస్సై కూడా అనుకూలంగా ఉన్నారన్న కారణంతోనే సీఐ, ఎస్సైలను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.