పిఠాపురం పరిధిలోని గొల్లప్రోలులో ఓ మర్డర్ అచ్చం సినిమా స్టయిల్‌లో జరిగింది. పాత సినిమాల్లోలా క్షమించాలని అడిగి, ఆ తర్వాత కౌగిలించుకుని వెంటనే కత్తి తీసి పోట్లు పొడిచి ఒక వ్యక్తిని చంపేశారు. ఆ వ్యక్తి ఆధిపత్యం పెరుగుతుందన్న ద్వేషంతోనే ఈ ఘటన జరిగింది. జలపాతానికి వెళ్లే సమయంలో మద్యం దగ్గర మొదలైన గొడవ, ఇంటికి తిరిగొచ్చాక ఘర్షణకు దారితీసింది. ఆ తర్వాత ఇంటికి వెళ్లి నమ్మించి మరీ ప్రాణాలు తీశారు.