ఒంగోలులో ఓ అంధురాలి హత్య కేసులో ఇప్పటి వరకు మిస్టరీ వీడలేదు. తమిళనాడులో పనిచేసే లెక్చరర్ బైక్ మీద ఒంగోలు వచ్చి, అంధురాలిని కలిసేందుకు లాడ్జ్‌కు వెళ్లాడు. ఆ తర్వాత ఆమెను హత్య చేసి అక్కడ నుంచి పరారయ్యాడు. హంతకుడిది మార్కాపురం జిల్లా సీఎస్‌పురం మండలం కావడంతో, అక్కడ నుంచి పరారయ్యాడు. అలా పరారైన వ్యక్తి ఆచూకీ ఇప్పటి వరకు దొరకలేదు. ఎక్కడున్నాడు, ఏమయ్యాడో తెలియకపోవడంతో ఈ కేసు పోలీసులకు పెద్ద సవాలుగా మారింది.