నందిగామ టీడీపీ అంతర్గత గొడవలు ఇప్పుడు వీధికెక్కాయి. ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకుని ఉన్న వ్యక్తిని కాదని.. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గరే, ప్రభుత్వ విప్ తంగిరా సౌమ్య ఎదుటే ఆత్మహత్యా యత్నానికి పాల్పడటంతో నందిగామ టీడీపీ వ్యవహారం రచ్చకెక్కింది.