KCR: నేను కొడితే మాములుగా ఉండదు.. ఫిబ్రవరి చివర్లో భారీ బహిరంగ సభ: కేసీఆర్

1 year ago 30
KCR: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇన్ని రోజులు తాను మౌనంగా ఉన్నానని.. తాను కొడితే మామూలుగా ఉండదని తీవ్ర హెచ్చరికలు చేశారు. రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు తాను చెప్పినా ప్రజలు వినిపించుకోకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించారని.. ఇప్పుడు అన్ని మబ్బులు విడిపోయి నిజాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కనిపిస్తే జనం కొట్టేలా ఉన్నారని కేసీఆర్ వెల్లడించారు.
Read Entire Article