హైదరాబాద్‌లో ఒక్కసారిగా భీకర వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, భీకర గాలులతో కుండపోత వాన పడింది. ఆకస్మికంగా కురిసిన వర్షంతో నగరవాసులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఏర్పడింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తుండగా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వలేదు. దీంతో సీఎం రేవంత్ విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు.