గుప్తనిధులు తవ్వి ఇస్తామంటూ అమాయక ప్రజలకు ఆశ చూపి కోటి రూపాయల వసూళ్లకు పాల్పడిన తెలంగాణ నకిలీబాబా దర్శనాల రాజ్‌కుమార్‌కు చట్టం కోలుకోలేని షాక్ ఇచ్చింది. బాధితులను ముంచి వసూలు చేసిన రూ.1.03 కోట్ల అక్రమ సొమ్ముతో పిప్పల్‌కోటిలో నిర్మించిన అతని సరికొత్త నివాసాన్ని ఆదిలాబాద్ పోలీసులు కోర్టు ఉత్తర్వుల మేరకు జప్తు చేసి సీజ్ చేశారు. నిందితుడిపై జిల్లావ్యాప్తంగా 19 చీటింగ్ కేసులు నమోదు కాగా.. ఇప్పటి వరకు 26 మంది బాధితులు ఉన్నట్లు గుర్తించారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే తమను సంప్రదించాలని కూడా పోలీసులు ప్రకటించారు.