ఆహార పదార్థాలలో మితిమీరిన రసాయనాల వాడకం సామాన్యులనే కాదు.. ఏకంగా కేంద్రమంత్రులను కూడా ఏ విధంగా ఆసుపత్రి పాలు చేస్తోందో వివరించారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. గడిచిన 20 ఏళ్లలో తనకు ఒక్కసారి కూడా జ్వరం రాలేదని.. కానీ ఇటీవల హైదరాబాద్‌లో పాలు తాగి మూడు రోజుల పాటు ఆస్పత్రి పాలయ్యానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగిన కిసాన్ మోర్చా సమ్మేళనంలో పాల్గొన్న ఆయన.. రసాయన ఎరువుల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతున్న వేల కోట్ల భారాన్ని వివరించారు.