హైదరాబాద్ శివారులో కొత్త ఎకనామిక్ కారిడార్ రాబోతుంది. తుక్కుగూడ హార్డ్‌వేర్ పార్క్-3 వద్ద కొత్త పారిశ్రామిక కారిడార్ రూపుదిద్దుకుంటోంది. భారత్ ఫ్యూచర్ సిటీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జోన్‌లో ఎనిమిది ప్రముఖ సంస్థలు రూ.5,723 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. దీని ద్వారా 8,890 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుంది. ఇప్పటికే అమెజాన్, ఏరోస్పేస్ పార్కులు, డిఫెన్స్ విడిభాగాల సంస్థలు ఇక్కడ విస్తరించగా.. ఏరోస్పేస్, ఇంజినీరింగ్ రంగాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ బహుళజాతి కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని టీజీఐఐసీ స్పష్టం చేసింది.