రంగారెడ్డి జిల్లా కోహెడలో రూ. 1,091 కోట్ల అంచనా వ్యయంతో 179 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ పండ్ల మార్కెట్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టుకు జూన్ 6న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఏఐ సేవలు, కోల్డ్ స్టోరేజీలు, కస్టమ్స్ కేంద్రం, ప్రతిభా సౌధం టవర్, హెలిప్యాడ్‌లతో ఈ మార్కెట్‌ను నిర్మించనున్నారు. మూడు దశల్లో సాగే ఈ ప్రాజెక్టు తొలి దశను ఈ ఏడాది డిసెంబరు 9 లోగా పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.