హైదరాబాద్‌లో వాహనదారులకు అధికారులు కీలక సూచనలు చేశారు. వైశాలీనగర్ అండర్‌పాస్‌ను 20 రోజుల పాటు బంద్ చేయనున్నట్లు తెలిపారు. ఈ అండర్‌పాస్ మూసివేయడంతో.. ప్రత్యామ్నాయ మార్గాలు కూడా వెల్లడించారు. రోడ్డు విస్తరణ, స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనుల కోసం వైశాలీనగర్ రైల్వే అండర్‌పాస్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. హఫీజ్‌పేట్, కొండాపూర్, మై హోమ్ మంగళా ప్రాంతాలకు వెళ్లే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.