హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఆ ఏరియాలో 120 అడుగుల వెడల్పుతో మరో రహదారి నిర్మాణం..

4 months ago 30
హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తూ మూసీ నది ప్రక్షాళన కోసం ప్రభుత్వం 'మోడల్ కారిడార్' నిర్మాణానికి సిద్ధమైంది. అంబర్‌పేట ఎస్టీపీ నుంచి నాగోల్ మెట్రో స్టేషన్ వరకు మూసీ తీరం వెంబడి 120 అడుగుల వెడల్పుతో భారీ రహదారిని నిర్మించనున్నారు. తొలి దశలో 2.7 కిలోమీటర్ల మేర రూ.160 కోట్లతో చేపట్టే ఈ పనుల్లో భాగంగా రామాంతపూర్ వద్ద కొత్త బ్రిడ్జిని కూడా నిర్మిస్తారు. ఈ రహదారి అందుబాటులోకి వస్తే వరంగల్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గడమే కాకుండా, గోల్నాక, ఉప్పల్ ప్రాంతాల ప్రజలకు ప్రయాణం సులభతరం అవుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే ఈ కారిడార్ వల్ల మూసీ ఆక్రమణలకు కూడా అడ్డుకట్ట పడనుంది.
Read Entire Article