హైదరాబాద్‌: వర్షం మిగిల్చిన విషాదం.. వరద నీటిలో కొట్టుకుపోయి వ్యక్తి మృతి

1 year ago 35
Hyderabad heavy rains man death: మే నెలలోనే వరుణుడు ప్రవేశించడంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం సాయంత్రం నగరంలోని జూబ్లీహిల్స్‌, సికింద్రాబాద్‌, కూకట్‌పల్లి ప్రాంతాల్లో కుండపోత వాన దెబ్బకు రోడ్లన్నీ జలమయమయ్యాయి, ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అంతేకాక సూరారంలో వరద నీటిలో కొట్టుకుపోయి పద్మారావు అనే వ్యక్తి మృతి చెందాడు. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ.10,000 పరిహారం ప్రకటించారు.
Read Entire Article