హైదరాబాద్‌లోని ఆ ప్రాంతానికి మహర్దశ.. రూ.1.40 కోట్లతో కొత్త రోడ్లకు శంకుస్థాపన..

7 months ago 21
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.. హిమాయత్‌నగర్‌లో రూ. 1.40 కోట్లతో డ్రైనేజీ, రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా.. తనపై ఉన్న అనర్హత వేటు అంశంపై స్పందిస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. తనకు ఎన్నికలు కొత్త కాదని, ఇప్పటికే 11 సార్లు పోరాడిన అనుభవం ఉందని తెలిపారు. రేవంత్ రెడ్డి మరో పదేళ్లు సీఎంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని.. గ్లోబల్ సమ్మిట్‌ను ప్రభుత్వం విజయవంతం చేస్తుందని దానం నాగేందర్ విశ్వాసం వ్యక్తం చేశారు.
Read Entire Article