విద్యుత్ క్రాస్ సబ్సిడీ సర్‌చార్జ్ వివాదంలో తెలంగాణ హైకోర్టు రెండు ప్రముఖ హోటళ్లకు చెరో రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.20 లక్షల జరిమానా విధించింది. గతంలో దాఖలు చేసిన కేసులు, బకాయిల చెల్లింపుల కోసం కోరిన వాయిదాల వివరాలను కోర్టుకు దాచిపెట్టారని న్యాయస్థానం తీవ్రంగా వ్యాఖ్యానించింది. కొత్త రిట్ పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు, జరిమానా మొత్తాన్ని తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవల అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది.