హైదరాబాద్‌లో ప్రభుత్వ భూములను కాజేసేందుకు ప్రయత్నం చేసిన కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో పరారీలో ఉన్న బొల్లా బ్రహ్మనాయుడుని హైదరాబాద్ పోలీసులు తమిళనాడులో అరెస్ట్‌లో అరెస్ట్ చేశారు. ప్రభుత్వ భూములను కొట్టేసేందుకు నకిలీ జీవోలు సృష్టించి.. వాటిని వైరల్ చేశారని విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారంలో రూ. కోట్లు చేతులు మారినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు.