హైదరాబాద్ ఆషాద బోనాల ఉత్సవాలు తెలంగాణ గంగా జమున తెహజీబ్‌కు ప్రతీకగా మంత్రి కొండా సురేఖ అభివర్ణించారు. జూలై 16 నుంచి హైదరాబాద్‌లో బోనాలు మొదలు కానున్న నేపథ్యంలో.. బోనాల జాతర పోస్టర్, బ్రోచర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. భక్తులు సంతోషంగా అమ్మవారిని దర్శించుకుని, నిండు మనసుతో ప్రభుత్వాన్ని దీవించాలని కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంతృప్తిగా ఇళ్లకు తిరిగి వెళ్లేలా అన్ని ప్రభుత్వ శాఖలు కలసికట్టుగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు.