హైదరాబాద్‌లో డెంగ్యూ పంజా.. ఏడాదంతా పొంచి ఉన్న ముప్పు.. హెచ్చరించిన ఆరోగ్య శాఖ

1 week ago 5
హైదరాబాద్‌లో మారుతున్న వాతావరణం, దోమల ఉత్పత్తి వల్ల డెంగ్యూ ఏడాదంతా ముప్పుగా మారుతోందని ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఈడిస్ ఈజిప్టి దోమలు ఇళ్లలోని కూలర్లు, ఏసీ పైపులు, పూలకుండీల స్వచ్ఛమైన నీటిలో ఎక్కువగా పెరుగుతున్నాయని నిపుణులు తెలిపారు. 80 శాతం కేసుల్లో లక్షణాలు లేకపోవడం వల్ల వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని, ఈ దోమలు పగటిపూట కుట్టడం వల్ల స్కూళ్లు, ఆఫీసుల్లో ముప్పు ఎక్కువని పేర్కొన్నారు. ప్రతి వారం ఇళ్లను శుభ్రం చేసుకోవడం ద్వారా దోమల నిర్మూలనకు సహకరించాలని ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్ కోరారు.
Read Entire Article