Hitech City Railway Station Inauguration On July 17: అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రీ డెవలప్ మెంట్ చేసిన హైదరాబాద్ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ఈ రైల్వే స్టేషన్ ఈ నెల 17న ప్రారంభంకానుంది. అదే రోజు మొత్తం 75 రైల్వే స్టేషన్లలను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను ఆధునిక హంగులతో అభివృద్ధి చేశారు.