హైదరాబాద్‌లో 3 కొత్త రిజర్వాయర్లు.. తాగునీటి కష్టాలకు చెక్

1 month ago 11
హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో తాగునీటి కష్టాల తీర్చేందుకు ప్రభుత్వం రూ.50 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా బండ్లగూడ పరిధిలోని పలు కాలనీలకు పైపులైన్ల ద్వారా నీటి సరఫరా పెరగనుంది. మరోవైపు.. నగరానికి నీరందించే సింగూరు జలాశయంలో నిల్వలు 5.477 టీఎంసీలకు పడిపోవడంతో జూన్ 1 నుంచి అత్యవసర పంపింగ్ చేపట్టేందుకు జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి ఏర్పాట్లను సమీక్షించారు. అయితే నాగార్జునసాగర్, ఎల్లంపల్లి, గండీపేట్ జలాశయాల్లో నిల్వలు మెరుగ్గా ఉండటం నగరవాసులకు ఊరటనిచ్చే అంశం.
Read Entire Article