హైదరాబాద్ ముంబై మధ్య ట్రైన్ ప్రయాణాలు సాగించేవారికి తీపి కబురు. హైదరాబాద్ - పుణె - ముంబై మధ్య ప్రతిపాదిత 761 కిలోమీటర్ల హైస్పీడ్ రైలు కారిడార్‌కు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) పూర్తయినట్లు రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నగరం నుంచి ముంబైకి ప్రయాణ సమయం మూడు గంటల లోపుకు తగ్గుతుందని పేర్కొన్నారు. దీంతో పాటు ఫ్యూచర్ సిటీ నుంచి చెన్నై, బెంగళూరు కారిడార్ల పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు.