హైదరాబాద్‌ కొంపల్లిలో అమానుష ఘటన.. మహిళపై దాడి చేసి చైన్ స్నాచింగ్‌కు యత్నం

1 month ago 11
హైదరాబాద్‌ కొంపల్లి పరిధిలోని జయభేరి కాలనీలో ఓ ఆయిల్ షాపు మహిళా యజమానురాలిపై చైన్ స్నాచింగ్ కోసం ఒక దుండగుడు విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. కస్టమర్ రూపంలో వచ్చి ఒంటరిగా ఉన్న మహిళను కిందపడేసి ముఖంపై పిడిగుద్దులు గుద్దుతూ మెడలోని బంగారం గొలుసు లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. బాధితురాలి కేకలు విన్న స్థానికులు వెంటనే స్పందించి నిందితుడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘోర దాడికి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Read Entire Article