హైదరాబాద్ వెంగళరావునగర్‌లోని సర్వే నం.45లో గల వివాదాస్పద రెండెకరాల భూమి వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు గానూ హైడ్రా కమిషనర్‌కు రూ.50 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశించినప్పటికీ సకాలంలో సరైన కౌంటర్లు దాఖలు చేయకపోవడంపై జస్టిస్ ఎన్.వి.శ్రవణ్‌కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ జరిమానా మొత్తాన్ని ప్రధాన న్యాయమూర్తి సహాయ నిధికి చెల్లించిన తర్వాతే కౌంటర్లు స్వీకరించాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను జూన్ 15కు వాయిదా వేశారు.