విజయనగరం జిల్లా రాజాం మండలంలోని డోలపేట హైస్కూలులో నెలకొన్న వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. కారును స్కూలు గేటుకు అడ్డుగా పెట్టవద్దని చెప్పినందుకు స్కూలు టీచర్ మీద కానిస్టేబుల్ కేటీ రాజు కొడుకు హర్షవర్ధన్ చేయిచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. ఉపాధ్యాయుడిపై దాడి చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలని కోరాయి. ఈ క్రమంలోనే హర్షవర్ధన్ వేణు మాస్టర్‌కు స్కూలులో బహిరంగ క్షమాపణ చెప్పడంతో వివాదానికి తెరపడింది.