తెలంగాణలో సేంద్రియ సాగును ప్రోత్సహించేందుకు, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక మార్కెట్లను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలో 10 వేల మంది రైతులు 61,125 ఎకరాల్లో సహజసిద్ధంగా పంటలు పండిస్తున్నారు. వీరి ఉత్పత్తుల విక్రయం కోసం ఇప్పటికే ఆర్గానిక్ యాప్ తెచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు నేరుగా హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక మార్కెట్ల ఏర్పాటుకు స్థల సేకరణ చేపట్టింది. తొలిదశలో వారానికి ఒకరోజు చొప్పున సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు, గేటెడ్ కమ్యూనిటీల వద్ద ఈ మార్కెట్లను నిర్వహించనున్నారు.