సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ..‘ఆ అక్రమ నిర్మాణాలను తొలగించండి’

6 months ago 20
వరంగల్ కోట భూముల్లో అక్రమ కట్టడాలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. కోట భూములను భారత పురావస్తుశాఖకు చెందినవిగా గుర్తించాలని, అక్రమ నిర్మాణాలను తొలగించాలని కోరారు. రెవెన్యూ రికార్డుల్లో తప్పులు సరిదిద్ది, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారసత్వ సంపద పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని కోరారు. కిషన్ రెడ్డి రాసిన లేఖ తెలంగాణ సమాజంలో చర్చనీయాంశంగా మారింది. అక్రమార్కులు వరంగల్ కోటను కూడా వదలడం లేదంటున్నారు జనాలు.
Read Entire Article