సినిమా స్టోరీని తలదన్నేలా భార్య హత్యకు ప్లాన్.. కూరగాయల సంచితో దొరికిపోయిన కిరాతకుడు

2 hours ago 2
సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో మే 30న జరిగిన మీనాదేవి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త అనిల్‌కుమార్ బిహార్‌కు చెందిన నలుగురు వ్యక్తులకు సుపారీ ఇచ్చి భార్యను గొంతుకోసి చంపించాడు. దారిదోపిడీ దొంగలు దాడి చేశారంటూ అనిల్ ఆడిన డ్రామాను పోలీసులు బట్టబయలు చేశారు. ఘటనా స్థలంలో చెల్లాచెదురు కాకుండా భద్రంగా ఉన్న కూరగాయల సంచి, భర్త శరీరంపై ఉన్న నకిలీ కత్తి గాట్లు పోలీసులకు అనుమానం కలిగించాయి. విచారణలో నిందితుడు నేరం అంగీకరించగా.. భర్తతో పాటు ఒక సుపారీ హంతకుడిని అరెస్ట్ చేశారు.
Read Entire Article