Simhachalam Temple Giri Pradakshina Update: సింహాచలం అప్పన్న ఆలయం గిరి ప్రదక్షిణపై కలెక్టర్ కీలక సమీక్ష నిర్వహించారు. ఈ నెల 28, 29 తేదీల్లో గిరి ప్రదక్షిణ నిర్వహిస్తామని.. భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఆదేశించారు. రెండు రోజుల పాటూ నిర్వహించే గిరి ప్రదక్షిణకు సంబంధించిన చేయాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష చేశారు. తాగునీరు, రెస్ట్ రూమ్‌లు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు.