సింగిల్ బెడ్‌రూంలతో మోడల్ కాలనీ.. త్వరలోనే లబ్ధిదారుల ఎంపిక, మంత్రి కీలక ప్రకటన

2 months ago 12
హుజూర్‌నగర్ నియోజకవర్గంలో పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ నిర్మించిన 'మోడల్ కాలనీ' ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. 116 ఎకరాల్లో నిర్మించిన 2160 సింగిల్ బెడ్ రూమ్ ఇళ్ల మోడల్ కాలనీని ఈ నెల చివరిలో ప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. గతంలోనే రూ.125 కోట్లు వెచ్చించగా, తాజాగా మరో రూ.20 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మొదటి విడతలో 1500 మంది అర్హులను అత్యంత పారదర్శకంగా ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. కాలనీలో తెలంగాణ పబ్లిక్ స్కూల్, అంగన్‌వాడీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్ వంటి అత్యాధునిక వసతులు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
Read Entire Article