సర్పంచితోపాటు కార్యదర్శికి చెక్‌పవర్‌.. ఇకపై గ్రామాల ఆదాయం నేరుగా వాడుకోవచ్చు..!

1 month ago 12
తెలంగాణలోని 12,760 గ్రామ పంచాయతీల సొంత ఆదాయ నిధుల వినియోగంలో ట్రెజరీల చుట్టూ తిరిగే తిప్పలను తప్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం పంచాయతీరాజ్ చట్టం-2018 లోని సెక్షన్ 70(3)ని సవరించనుంది. ఇకపై ఏటా వచ్చే రూ.140 కోట్ల అంతర్గత ఆదాయం నేరుగా బ్యాంకుల్లో జమై.. గ్రామ అవసరాలకు వాడుకునే వెసులుబాటు కలుగుతుంది. చెక్ పవర్ విధానంలో ఉపసర్పంచ్ స్థానంలో గ్రామ కార్యదర్శికి ఉమ్మడి అధికారం కల్పిస్తారు. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ-పంచాయత్ వెబ్‌సైట్ నమోదు, వార్షిక ఆడిట్ వంటి కఠిన నిబంధనలను ప్రభుత్వం అమలు చేయనుంది.
Read Entire Article