Bapatla District Circar Express Train Robbery: బాపట్ల జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. రన్నింగ్ ఉన్న సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైల్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. తమిళనాడులోని చెంగల్పట్టు నుంచి కాకినాడ వైపు వెళ్తున్న రైల్లో బాపట్ల - అప్పికట్ల స్టేషన్ల మధ్య దొంగలు చోరీ చేశారు. రైల్లో నిద్రిస్తున్న మహిళల ఆభరణాలు చోరీ చేశారు. వారు పెద్దగా కేకలు వేయగా.. ప్రయాణికులు చైన్ లాగారు. వెంటనే దొంగలు రైలు నుంచి కిందకు దిగి పారిపోయారు.. వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ప్రస్తుతం దొంగల కోసం గాలిపు కొనసాగుతోంది.