తెలంగాణలో సన్న వడ్లకు ప్రకటించిన బోనస్‌ను పారదర్శకంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2026 వానాకాలం సీజన్‌కు గాను ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన ఏడు రకాల సన్న వరి విత్తనాలు సాగు చేసే రైతులకు మాత్రమే ఈ బోనస్ వర్తిస్తుంది. విత్తన డీలర్లు తాము విక్రయించిన సన్న వరి విత్తనాల వివరాలను వెంటనే అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి. డీలర్ల వద్ద కాకుండా, సొంతంగా విత్తనాలు దాచుకుని సాగు చేసే రైతులకు తమ పరిధిలోని ఏఈవోల ద్వారా యాప్‌లో నమోదు చేసుకునే వీలు కల్పించారు.