సనత్‌నగర్‌లోని 1000 పడకల టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రయోగాత్మకంగా ఓపీ సేవలు ప్రారంభమయ్యాయి. రూ.1100 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 22 స్పెషాలిటీ విభాగాలు, 300 ఐసీయూ పడకలు, అత్యాధునిక ల్యాబ్ వసతులు ఉన్నాయి. నెల రోజుల ట్రయల్ రన్ అనంతరం జూన్ 2 నాటికి పూర్తిస్థాయిలో ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రోగుల సహాయకుల కోసం ప్రత్యేకంగా ధర్మశాలను నిర్మించారు.